Wednesday, 31 July 2013

andham-అందం

పారిజాతమా ..
పారే జలపాతమా ..

రంగవల్లివా ..
రంగుల హరివిల్లువా ..

కళాఖండమా ..
కళల అఖండమా ..

నీలిమేగమా ..
నడిచే అమోగమా.. .. 

                                !!సురేష్!!

                                         

Monday, 22 July 2013

andham-అందం

నీలాల మేఘాలు 

కదిలేనుగా ... 

నీడల్లే నీ వెనుక 

నడిచేనుగా ... 


సంగీత స్వరాలు 

సడలేనుగా ... 

 

సరిగమలుగా 

నీ స్వరమున 

మ్రోగేనుగా ...

           !!సురేష్ !!

jevitham-జీవితం

కాలానికి 

క్రుంగకు ... 

ఆలోచన 

అనచకు... 

 

ప్రతి ప్రశ్నకు సమాధానం నువ్వు 

బయపడే ప్రతి నిమిషం 

నీ గమ్యం అగమ్యం .....

ఆటంకాలని అధిగమిస్తూ 

ఆనందాలని ఆస్వాదించు .....

                                                      !!సురేష్!!

Saturday, 6 July 2013

desam-దేశం


ఆడుగడుగో
అణుబాంబులా...
అహింసను
ఆయుధముగా...
శాంతిని
సైన్యముగా... 

ఆంగ్లేయుల
ఆదిపత్యమనిచాడురా...
శతాబ్ధాల భానిసత్వ బంద్దీలను  తెంచాడురా...
భాగ్యమల్లె  భరతభుమికందాడురా...
భావితర భగవంతుడయ్యాడురా... 


                                    !!సురేష్!!


prema-ప్రేమ


నాలోని నేను 

నిలిచేదెలా

 నా ఎదుట నీవు 

నిలిచుండగా .. ?


కనురెప్పలు 

మూసేదెలా 


నా కనుపాపలో 

నీవుండగా .. ?

                        
                        !!సురేష్ !!

Friday, 5 July 2013

baadha-బాధ


నీడ వీడిపోతుంది నడిరాత్రికి నన్నొదిలి ... 


కధ కదిలిపోతుంది కన్నీటికి జత చేసి ... 


                           !!సురేష్ !!

Tuesday, 2 July 2013

jevitham-జీవితం

ఎవరితో
ఎవరెవరు
ఎన్నాళ్ళురా .... ?


చెయ్యి కలిపిన
వారే,గొయ్యి
తొవ్వేనురా ...... 


బంధాలు
బారాలుగా
మారేనురా ...... 


మనుషులనెరిగి
మసులుకోరా
మానవుడా ...... 


                           !!సురేష్!!