Sunday, 25 August 2013

prema-ప్రేమ

నువు పలికిన 

చిరు పలుకుల 

విరి సవ్వడి 

దడ దడల 

యదలోతున 

మధురంగా 

మృదులంగా 

ప్రవాహంగా  జారి 

నిదరోయిన 

నా మదికి 

ఈ తీయని 

చిరు రేయిని 

రాల్చినది నీ స్వరం

                             !!సురేష్!!

Friday, 23 August 2013

prema-ప్రేమ

తొలి చూపుతో 

మలి చూపుకై 

మది వేచిన 

క్షణ క్షణం 

అనుక్షణం 

నిరీక్షనై 

నీకై తీక్షణ 

ప్రయాణ ప్రవాహ 

సంద్రాన సాగుతున్నా 

                             !!సురేష్!!
Friday, 16 August 2013

jevitham-జీవితం

నా కవిత ----నా కోసం 

!!! మబ్బుని  చీల్చే మెరుపుని 

మదిలో నిలిచే మమతని 

కలము వీడిన కవితని 

కనులలో నిండిన కలలని 

చిరుగాలికి కలిగే కోరికని 

చెక్కిలి చెలి చిరుసవ్వడిని !!!

                                              !!సురేష్!!

Wednesday, 14 August 2013

desam-దేశం

జన గణ మన పాడుతూ 

మన జాతిని తలుస్తూ 

ఏడాదికి ఓ నాడు  

పండుగ కాదు స్వాతంత్ర్యం 


ఎందరో మహనీయుల మరణత్యాగాలు 

శతాబ్ధాల శోక సంద్ర విమోచనం


రెండు వందల ఏళ్ళ బందీలను 

బద్దలుకొట్టిన ముద్దుబిడ్డల జ్ఞాపకం 

 

!!!!మహనీయులను తలిస్తే సరిపోదు 

వారి జాడలలో నడవాలి ,,,

జన గణ మన పాడితే సరిపోదు 

జాతిని  జనజీవాన్ని గౌరవించాలి !!!!!


                                     !!సురేష్!!baadha-బాధ

ఏమో  ఈ మౌనం 

ఎన్నాల్లో ఈ విరహం ....


నను మాయ చేసి 

నువ్వు మౌనమాయనే.... 


తొలి మాటకై 

నా మది వేచి చూసనే ....

                              !!సురేష్!!

Monday, 12 August 2013

prema-ప్రేమ

 ..... ప్రేమ -ప్రాణం .....  


ప్రేయసని మరవకురా 

మరచి .................

ప్రాణాన్ని విడవకురా మరచిన ప్రేమకు మరణము లేదురా 

ప్రేమను...................................

విడిచిన మనసుకి మరణమే తోడురా


                                                                  !!సురేష్!!

baadha-బాధ

 

..................శిక్ష.................

 

తెలియని బాధ చెంత చేరనే

మనసుకి గాయం చేసి మంట రేపనే... 


కంటికి కలలు దూరమాయనే

నను ఒంటరి చేసి ఆటలాడనే ... 


నా నీడే నాపై కక్ష్య కట్టనే 

నను నిప్పుల ఒడిలో తోసివేసనే ... 


స్వర్గంలోను శిక్షలేశనే 

నేనున్న చోటే నరకమాయనే ...

                                                              !!సురేష్!!

baadha-బాధ

 

....... నాకు నేనే తోడు...... 

కనుల నిండా నీరు చేరనే... 

కనుపాపకు తెరగా మారనే... 

నా లోకమంతా చీకటాయనే... 

చివరికి నాకు నేనే తోడు మిగిలనే ....

                                                           !!సురేష్!!

prema-ప్రేమ

మెరిసే మెరుపలా 

కురిసే వానలా 

విరిసే పువ్వలా

నువ్వు కనిపించావే ... 

నను మరిపించావే ...


నిదరోతున్న హృదయాన్ని నిద్ర  లేపావే ...

నాతో నడిచే నా నీడను నీవైపు లాగావే ...

ప్రాణం లేని నా ప్రేమకు ఊపిరి పోసావే ....

                                                                  !!సురేష్!!

prema-ప్రేమ

నా కనులకు కళలు నీవు... 

కనుమూసిన కనుతెరిచిన 

నా లోకం నీవు ...


నాలో నవ్వులు నీవు ... 

తనువుకి మనసుకి 

ప్రతి స్పర్శ నీవు ...

                                     !!సురేష్!!

prema-ప్రేమ

ప్రేమకు లేదే ప్రతిరూపం,,,

భావం లేనిది ఆ మధురం,,,


కలలలో కరిగే ఆ కాలం,,,

మనసున వుండదు మరుధ్యానం,,,

                                                       !!సురేష్!!

baadha-బాధ

విధితో విరోధం నాలో మిగిల్చెను ఒంటరితనం 

మదితో పోరాటం నాలో కురిపించెను కన్నీటి వర్షం 


వ్యధను తెలుపుటకు నాలో మిగిలినది ప్రాణం 

మది కలవరమునకు నా మౌనమే ఔషధం ... ... 

                                                                               !!సురేష్!!

baadha-బాధ

యదన బాధ తెలుప  లేదే  కవిత... 

శిధిలమైన  నా మనుసుకి లేదే జత... 


చేతిలో  కలము వ్రాయనన్నదే... 

కనుల నీరు కరగనన్నవే... 


భావం లేని కవ్యమైనది నా మది... ... 

                                                         !!సురేష్!!

andham-అందం

...... ప్రకృతి వరాలు....... 

 

వీచే గాలుల సరాగాలు

పారే ఏరుల సుస్వరాలు


కురిసే చినుకుల సవ్వడులు

ఉరిమే ఉరుముల శ్రుతి లయలు

         

                            !!సురేష్!!
Sunday, 11 August 2013

baadha-బాధ

మరిచిపోతే

చచ్చిపోయే 

జ్ఞాపకాలు 

వెంటవస్తూ ... 

 

అనుక్షణం 

నీ గతం 

వెంటాడుతున్నది  ... 

 

ఊపిరాడక 

హృదయలయలు 

ఆగుచున్నవి .... 

                       !!సురేష్!!andham-అందం

కనురెప్పల కలయక

కష్టతరం చేస్తుందే....


జాబిలమ్మకు సరితూగిన నీ అందం ..

వేయి తారల  వెలుగు నిండిన కనులు నీవి ...

కోటి రాగాల వీన కలిగిన  స్వరము  నీది.... 

                                              !!సురేష్!!


Tuesday, 6 August 2013

desam-దేశం

ఆరాటం కాదు పోరాటమంటే... 

అల్లరి మూకల 

చిల్లరి చేష్టలు 

కాదు పోరాటమంటే... 


ఆకలి అరుపుల రూపం పోరాటం

అవినీతిని అనిచే ఆయుధం పోరాటం

                                                   !!సురేష్!!

Sunday, 4 August 2013

thodu-తోడు

మనసు ఎరిగి

మమత  పంచురా

ఆపద తలచి 

తోడు నిలిచెరా 

రక్త బంధంలేని 

రక్ష వీడురా 

                       !!సురేష్!!


Friday, 2 August 2013

andham-అందం

నువ్వు తారసపడితే 

ప్రకృతి సైతం 

పులకరించదా ... 


నీ గాలి సోకగా 

మేఘాలు ధరణిపై

ధారలా జారవా.... 

 

సృష్టికర్త బ్రహ్మ 

నీ సృష్టికి 

మురిసిపోడా ...

                                         !!సురేష్!!

Thursday, 1 August 2013

desam-దేశం

రాజకీయ ఆటలో 

రాష్ట్ర ప్రజలు 

గెలిచినా ...?

ఓడినా ..?

 బందులతో 

భవిష్యత్తుని 

అదుముతున్నారు .. 

 పోరులతో 

యువతరం 

అడుగులు  వేసి 

 అభివృద్ధికి

అడ్డంకిగా 

మారినారు .. 

 బలిదానాలకు 

నిండు జీవితాన్ని 

నిలబెట్టి 

 తల్లితండ్రుల 

ఆశలని 

కూల్చినారు  ... 

ప్రశ్నించక 

ప్రజలు 

ప్రశ్నార్ధకమయ్యారు ... 

                             !!సురేష్!!