Tuesday, 8 December 2015

baadha-బాధ

మరిచిపోలేని మనసు చచ్చిపోతున్నది.

కలై కనులు తాకి కన్నీరై కరిగావే.

ప్రేమై మనసు చేరి జారి దూరమయ్యావు.

తెలిసి తెలియని మనసు చేసిన యోచనా.?
లేక,
తలరాతను నడిపే కాలపు కటోర క్రీడనా.?

                                            !!సురేష్! !సారిక!!

Marichipooleeni manasu chachipoothunnadhi.
Kalai kanulu thaaki kanneerai karigaavee.
Premai manasu cheeri jaari dooramayyaavu.

Thelisi theliyani manasu cheesina yoochanaa.?
Leeka,
Thalaraathanu nadipee kaalapu katoora kreedana.?
                                                    !!suresh! !sarika!!

prema-ప్రేమ

తరగని దూరం లేదే మనమధ్య.

మరవని వేదన కాదే అతిపెద్ద.

చెరగని గొడవలు కావే మనవి.

మరవగలనని మరలిపోకు.

నన్ను మరిచే మనసా నీది.?

బదులివ్వవే మౌనం వీడి...

                         !!సురేష్! !సారిక!!


Tharagani dooram leedhe manamadhya.
Maravani veedhana kaadhe athipedha.
Cheragani godavalu kaave manavi.
Maravagalanani maralipooku.
Nannu marichee manasaa needhi.?
Badhulivvavee mounam veedi ...
                                   !!suresh! !sarika!!

Sunday, 29 November 2015

viraham-విరహం

తలచి తలచి నిన్ను

తడుస్తుంది కన్ను. 

నీ ముద్దు ముద్దు మాటలు
                    నే మరిచేదెలా.!

నీ మాయలో మునిగున్న
                   నేను తేలేదెలా.!

                           !!సురేష్!!!!సారిక!!


Thalachi thalachi ninnu
Thadusthundhi kannu
Nee mudhu mudhu maatalu
                      Nee maricheedhelaa.!
Nee maayaloo munigunna 
                      Nenu theeledhelaa.!


prema-ప్రేమ

ఏవో గిలిగింతల  తుల్లింతలు  నాలో నీ వల్లనే..

నీ జ్ఞాపకాల జల్లు తడుపుతున్నది కలై నా  కన్ను..

నీ ఊహల ఊపిరి వదిలి పోనన్నది నన్ను...

                                              !!సురేష్!! !!సారిక!!


Eevoo giliginthala thullinthalu naaloo nee vallanee.

Nee gnaapakaala jallu thaduputhunnadhi naa kannu.
Nee oohala oopiri vadhili poonannadhi nannu....

Saturday, 7 November 2015

jevitham-జీవితం

కన్న కలలు కలలుగా మిగలనివ్వకు..
నడిచిన అడుగుల గుర్తులు చెరగనివ్వకు..


చీకటి కలలకు వెలుగునివ్వు..
వేసే అడుగుకి బలమునివ్వు.. 


                          !!సురేష్ సారిక!!


Kanna kalalu kalaluga migalanivvaku.
Nadichina adugula gurthulu cheraganivvaku.

Cheekati kalalaku velugunivvu.
Veesa aduguki balamunivvu..

Wednesday, 30 September 2015

jevitham-జీవితం

ఆత్మ వంచనతో బ్రతకకు...
ఆత్మ సంతృప్తితో బ్రతుకు...  


మంచిని సమాధి చెయ్యకు...
మానవ తత్వాన్ని మరవకు...  


నలుగురిని నడిపిస్తూ నడువు...
ఆనందాన్ని పంచుతూ ఆనందించు...  

                                                !!సురేష్!! !!సారిక!!
Aathma vanchanatho brathakaku.
Aathma santhrupthitho brathuku.

Manchini samaadhi cheyyaku.
Maanava thathvaanni maravaku.

Nalugurini nadipisthuu naduvuu.
Anandhaani panchuthuu aanandhinchu...


Saturday, 19 September 2015

baadha-బాధ

విడిచి వుండలేను నిన్ను
దూరం దహిస్తుంది నన్ను
తలచి తడుస్తుంది కన్ను
నిత్యం తపిస్తుంది నిన్ను
                         !!సురేష్!! !!సారిక!!

Vidichi vundaleenu ninnu.
Dooram dhahisthundhi nannu.
Thalachi thadusthundhi kannu.
Nithyam thapisthundhi ninnu.

Wednesday, 9 September 2015

baadha-బాధ

నా మది శబ్ధం విధ్వంశంలా వినిపడుతుంది...
నా ఊపిరి పెనుగాలై నాపై వీస్తుంది....
కనులు మూతపడి చీకటి నను కప్పేస్తుంది...
పుట్టిన క్షణాన ఊపిరి కోసం పోరాడుతున్నా....
                                                !!సురేష్!! !!సారిక!!
Tuesday, 1 September 2015

baadha-బాధ

నిశ్యబ్ధంగా అరిచే అరుపుల శబ్దం వినపడలేదా....?ప్రియా
మనసిచ్చిన నాడే మాటిచ్చా తుది వరకు నీ తోడుంటా అని...
నీ చేయి పట్టిన నాడే పలికా నీ చిరునవ్వుని చెరగనివ్వను అని...
నా తోడుగా లేవేమో కాని.......నువ్వు
నా యదలో దేవతవై కొలువున్నావు...  


                                     !!సురేష్!! !!సారిక !!
Thursday, 27 August 2015

kala-కల

కల 


చీకటి తెచ్చే కల.. 

కలలో కోటి రంగుల వల..  


మధురపు రుచులను పంచెను కల..  

మరణపు బయములు పెంచును కల..  


ప్రపంచాన్ని నీ ముందుంచును కల..  

ప్రపంచపు అంచున చేర్చును కల..  


జీవితపు సగ బాగం కల.. 

కల లేని జీవితం విలవిల...                                        

                         !!సురేష్!! !! సారిక!!
Saturday, 15 August 2015

jevitham-జీవితం

దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కాని..
దేశ ప్రజలింకా ఆశా వ్యామోహాలకి బానిసలుగానే వున్నారు ..
మనిషిలో ఆశా వ్యామోహo  వున్నన్ని రోజులు తనకు తాను బందీ గానే వుంటాడు ....
!!సురేష్!! !! సారిక!!desam-దేశం

పరాయి పాలన వద్దనుకున్నాం ...
స్వరాజ్య సమరం పూరించాం ... 

చేయి చేయి కలిసి ...
సత్యగ్రహమై సాగింది ...
ఇంట ఇంటన అడుగులు కదిలి ...
హిందు సైన్యపు పునాది పడినది...
దేశభక్తితో పొంగిన అలలు ...
ఎగిసిపడెను అంగ్లేయులపై ..
మహనీయుల ప్రాణత్యాగం ఫలించింది ...
వీరత్వంతో బానిసత్వాన్ని తరిమకొట్టాం ...
.... జై హింద్....
                                  !!సురేష్!! !!సారిక!!
Wednesday, 8 July 2015

baadha-బాధ

పెరిగిన  దూరపు భారం మోయలేనిది .... 

తరగని కన్నీటి ధార గోరమైనది .... 

 

ఒకటిగా వున్న మనం విడిపోయేదెలా...?

మరుపన్నది లేని  మది మరిచేదెలా....?

 

నాలో నీ నవ్వుల వెలుగులు ఎప్పటికి ఆరనివి ... 

నా కనురెప్పల కలయకలో నీ రూపం చెరగనిది .... 

                                              !!సురేష్!! !!సారిక!!

Sunday, 7 June 2015

prayaanam-ప్రయాణం

జారే జలధారకు దారులు తెలుసా ..?
వీచే చిరుగాలికి గమ్యం వుందా ......?
కరిగే కాలానికి అంతం కలదా ..... ?
మరి సాగే మన పయనానికి హద్దులు దేనికి ..!
జలధారలా ,చిరుగాలిలా
కాలంతో  నలుదిక్కులు సాగిపో............
                                            !!సురేష్!! !!సారిక !! 

prema-ప్రేమ

నిదురించే వేల నా యదపై నీవు
పయనించే వేల నా జతగా నీవు
నే ఒంటరి వేల నీ ఊహలు తోడు
నే మరిచేదెలా  నిత్యం నిన్ను స్మరిస్తూ ....
                                         !!సురేష్!! !!సారిక!!baadha-బాధ

తరగని దూరం
కరగని కలత
చల్లారని కన్నీరు
నాకు కనురెప్పల చప్పుళ్ళు ఎన్నున్నా
నా తోడు కన్నీటి చీకటి ఒకటే ........
                             !!సురేష్!! !!సారిక!!

Sunday, 10 May 2015

prema-ప్రేమ

గడిచిన కాలం నీవు
నడిచిన దూరం నీవు
విడిచిన ఊపిరి నీవు
కారిన కన్నీరు నీవు
జారిన వరమే  నీవు
కరిగిన ప్రేమవు నీవు
నమ్మిన అబద్ధం నీవు
వీడిన వెలుగు నీవు
వదిలిన బంధం నీవు
కలిగిన బాధవు నీవు
కరువైన నిధ్రవు నీవు
వేటాడే మృత్యువు నీవు
ఓడిన యుద్ధం నీవు ...
                        !!సురేష్ !! !! సారిక!!


Wednesday, 6 May 2015

baadha-బాధ

యదలో ఆవేదన రోధనై
కన్నీరులా కారింది...
గుండ్డెల్లో దాచిన ప్రేమామృతం
విషమై ప్రాణం తీసింది....
                   !!సురేష్!! !!సారిక!!

prema-ప్రేమ

వసంత వయసున పూసిన ప్రేమ... 

ఆనంద పరిమళం పంచి.....!!!

రాలినది వీచిన బరువులకి.... 

మిగిలినది మోడైన మది ఒకటి... 

                            !!సురేష్!! !!సారిక!!

Sunday, 5 April 2015

baadha-బాధ

వడిలిన పువ్వు కొమ్మకు బరువేగా ......
వెలుగునిచ్చు దీపం వెలుగులో చులకనగా ...
రాగాలెరుగని  కోయల కన్నులకి  కాకేగా ...
ఎన్నో రంగులున్నా చీకటిలో నలుపేగా ...
గమ్యం లేని పరుగులకి మలుపులు వ్యర్ధముగా ...
నీ జతలేని నా గతి గతుకుల రహదారేగా....
                                                    !!సురేష్!! !!సారిక!!


Thursday, 2 April 2015

jevitham-జీవితం

నా మనసే నా ప్రపంచం
నా కలలే నా జీవితం
నా ఆనందమే నా కుటుంబం
నా బాదే నా శత్రువు .....
                              !!సురేష్!! !!సారిక!!

Thursday, 26 March 2015

jevitham-జీవితం

తీరానికి దారులు వేసి
చీకటిలో పరుగులు తీసి
గల్లంతై నడిసంద్రంలో నిలిచున్నా
వెలుగులకై కన్నుల్లో కలలే కన్నా ..... 


ఓ విజయపు వెలుగు నను తీరానికి చేరుస్తుందని .......
                                                     !!సురేష్!!!!సారిక!!Friday, 20 March 2015

prayaanam-ప్రయాణం

నింగిలోన ఎంత నీరున్నా ...

నేలను తాకని చినుకుకు విలువ లేదే... 


అక్షరాలెన్నున్నా.... 

అమరిక లేక వాటికి అర్ధం కరువే ... 


ఆలోచనలెన్నున్నా ...

ఆచరణ లేనివన్నీ వ్యర్ధం అగునే ... 


                                             !!సురేష్!! !!సారిక!!

Monday, 23 February 2015

prema-ప్రేమ

నిత్యం మెదిలే మదిలో ...
నిశ్చల స్థానం నీది...
నిత్యం కదిలే కనురెప్పల చాటున...
కదలని రూపం నీది ..
నాలో చలించే ఆలోచనలెన్నో...
అయినా చెరగని దరహాసం నీది ... 
                                           !!సురేష్!! !!సారిక!! 


Sunday, 11 January 2015

amma-అమ్మ

నరకాన్ని చవిచూస్తూ జన్మనిచ్చింది అమ్మ 

కంటిపాపలా నన్ను కాచి పెంచింది అమ్మ 

 

పసి పాదాలు తాకితే పులకరించింది అమ్మ 
బోసి నవ్వులు చూసి మైమరిచింది అమ్మ  


వేలు పట్టి నడిపింది అమ్మ 

తడబడితే ముందు నిలిచింది అమ్మ 


ప్రేమానురాగాలు అద్ది తీర్చిదిద్దింది అమ్మ 

గోరుముద్దలు పెట్టి నన్నింతవాడిని చేసింది అమ్మ 


అమ్మ అనురాగ ఋణం తీర్చే దారేది....???

మా అమ్మకు తిరిగి అమ్మనవడం తప్ప...!!! 

                                           !!సురేష్!! !!సారిక!!


 

andham-అందం

ఓ కలకమ్మెను నా కన్నులకి
కలలో కనువింధగు ఓ రూపం
మల్లె మొగ్గలా నవ్వుతూ
పాల పొంగులా కదులుతూ
చీకటి నిండిన కన్నులలో
వెలుగులు చిందే తారలా రాలింది ....
                                        !!సురేష్!! !!సారిక!!