Sunday, 11 January 2015

amma-అమ్మ

నరకాన్ని చవిచూస్తూ జన్మనిచ్చింది అమ్మ 

కంటిపాపలా నన్ను కాచి పెంచింది అమ్మ 

 

పసి పాదాలు తాకితే పులకరించింది అమ్మ 
బోసి నవ్వులు చూసి మైమరిచింది అమ్మ  


వేలు పట్టి నడిపింది అమ్మ 

తడబడితే ముందు నిలిచింది అమ్మ 


ప్రేమానురాగాలు అద్ది తీర్చిదిద్దింది అమ్మ 

గోరుముద్దలు పెట్టి నన్నింతవాడిని చేసింది అమ్మ 


అమ్మ అనురాగ ఋణం తీర్చే దారేది....???

మా అమ్మకు తిరిగి అమ్మనవడం తప్ప...!!! 

                                           !!సురేష్!! !!సారిక!!


 

andham-అందం

ఓ కలకమ్మెను నా కన్నులకి
కలలో కనువింధగు ఓ రూపం
మల్లె మొగ్గలా నవ్వుతూ
పాల పొంగులా కదులుతూ
చీకటి నిండిన కన్నులలో
వెలుగులు చిందే తారలా రాలింది ....
                                        !!సురేష్!! !!సారిక!!