24, డిసెంబర్ 2018, సోమవారం

నా కథ – Part 1



అణువై అమ్మ కడుపులో మొదలైన జీవితం

భరిస్తూ నవమాసాలు పొదిగింది భద్రంగా.
రక్తపు తొట్టె అది.
చీకటి కూపం అది.
బయట ప్రపంచం తీరు తెలియక
లోపలిక వుండలేక,
నొప్పని అరవలేక,
తెలిసిన భాషలో గుక్కపెట్టి ఏడుస్తూ బయట పడ్డా.
కనపడని ఆనందం.
వినపడని హహ్లాదం.
నా చుట్టూ ఆ క్షణం.
మెల్లగ కనులు తెరిచి మండే వెలుగు చూసా.
నన్ను చూసి మురిసిపోతున్న తల్లిని చూసా.
నా అంతట నేనే నానా తంటాలు పడి తిరగబడ్డా.
అందనిది అందుకునేందుకు పాకులాడా.
అమ్మ బడిలో నిదరోయా
అయ్య యదపై ఆటలాడా
బుడిబుడి అడుగులు వేస్తూ బడికి చేరా.
అల్లరి చేస్తూ అక్షరాలు దిద్దా.
నలగని పదాలు నములుతూ మాటలు నేర్చా.
నడకరాక తప్పటడుగులు వేసా.
మందలించిన నాన్న.
బుజ్జగించిన అమ్మ.
నడకలు పరుగులైనవి.
మాటలు తేట పడినవి.
విలువలు నేర్పని పంతుళ్ళు.
బ్రతుకుట నేర్పని చదువులు.
మనుషుల మందలో నేనొకడినయ్యా.


@సురేష్ సారిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి