Sunday, 26 January 2020

మైలపడింది జీవితం నీ ఎడబాటుతో - Telugu Quotes

మైలపడింది జీవితం నీ ఎడబాటుతో
ఆనందం అంటరానిదైనది
ఒంటరి తనమే ఓదార్పైనది
ప్రేమనే పండుగా లేదు,
కొత్తగ బంధు కార్యము లేదు
పొలిమేర దాటకూడని కోరికలట
హద్దుమీరకూడని తీపి భావాలట
పాడుబడ్డ బ్రతుకుని శుభ్రం చేసేదెన్నడో?
మనసుపై వేదన ముసుగుని తీసేదెన్నడో?
కన్నీటి మరకలపై రంగులు అద్దేదెన్నడో?
@సురేష్ సారిక

Telugu Quotes On Love

Telugu Quotes On Life

Saturday, 25 January 2020

మతిమాలిన యువతను మధించాలి నేడు - Telugu Quotes

మతిమాలిన యువతను మధించాలి నేడు
బానిస బ్రతుకు శిక్షణలో పట్టభద్రులు మీరు
కాసుల లక్ష్య చేదనలో నిమగ్నులయ్యారు
కడుపు నిండేందుకు ఎంగిలి మెతుకులు వేరుకుంటున్నారు
నీతి మాలిన జాతి ఉమ్మిన జీవన సరళిలో
కొట్టుకుపోతున్నా గొప్ప నావికులు మీరు
జివ చచ్చిన ప్రాణులు మీరు
పిరికితనపు వారసులు మీరు
ఆత్మ వంచకులు మీరు
ప్రశ్నల రాపిడి లేదే మీలో
రగిలే ఆలోచనలెక్కడ పుట్టెను
మేలుకో
జీవిత యధార్ధమేమిటో తెలుసుకో
నీ విలువ పెంచుకునేలా మసులుకో
దాసోహమవ్వకు దేనికి
క్షణాల సుఖలకై అల్లాడకు
ఓటమి తలచి బయపడకు
వల్లకాదని వెనకడుగు వెయ్యకు
బ్రతుకుంటే చాలనుకోకు
చాలనుకుంటు సర్దుకుపోకు
సత్తువున్నోడివి నువ్వు
సందేహపడకు నీపై నువ్వు
telugu quotes
Telugu Quotes
రెప్ప పాటు కష్టం దాటితే
ఎప్పటికీ నిలిచే చరిత్ర పుడుతుంది
లే..
లేచి
నిలబడు
వొళ్ళు విరుచుకుని తిరగబడు
బలం పుంజుకుని పొరాడు
నీకు నచ్చని నీతో నువ్వు
నిన్ను కన్నోరికి పేరు తెచ్చేలా
నువ్వు కన్నోరికి స్ఫూర్తినిచ్చేలా
@సురేష్ సారిక

Telugu Quotes On Love

Telugu Quotes On Life

Thursday, 23 January 2020

నియంతనై నను నేను పాలించాలి – Telugu Quotes

చాలిక
సున్నిత భావాల తొలకరి చినుకులు
లేలేత పోలికల అలంకార హంగులు
చాలిక
గబ్బుమంటున్న గత ప్రస్థావనలు
ఓటమిని ఎదుర్కోలేని భయాందోళనలు
చాలిక
నన్ను ఓడిస్తున్న సుకమైన అలసట
నేనే.. రేపు చీదరించే నేటి మనుగడ
ఇకపై
నియంతనై నను నేను పాలించాలి
పట్టువీడక ఆశపడినది సాధించాలి
నాలోని సత్తువంతా బయట పెట్టాలి
బ్రహ్మరాతను ధిక్కరించేలా
నా ప్రతి అడుగు పడాలి
@సురేష్ సారిక

Telugu Quotes On Love

Telugu Quotes On Life


వెతుకుతున్నా – Sad Telugu Quotes

వెతుకుతున్నది
ముచ్చెమటలు పట్టిన కన్ను ఓదార్పుకై
వెతుకుతున్నది
దడలంటిన గుండె హత్తుకునే తోడుకై
@సురేష్ సారిక

Telugu Quotes On Love

Telugu Quotes On Life

Wednesday, 22 January 2020

నీ ఎడబాటు - Telugu Quotes on Love

నీ ఎడబాటు
వణికిస్తోంది సున్నిత హృదయాన్ని
నీ తలపు
వేడెక్కిస్తుంది నాలో ఊపిరి ప్రవాహాన్ని
@సురేష్ సారిక

Telugu Quotes on Love

Telugu Quotes on Life

Friday, 3 January 2020

అలిసి ఆగిన అడుగులు

ఈ అడుగుల గుర్తులు
ఆస్వాదిస్తూ పడినవి కొన్ని
ఆలోచనల భారంతో పడినవి కొన్ని
పరిగెత్తినవి కొన్ని
పదిలంగా మోపినవి కొన్ని
గెలిచినవి కొన్ని
అలిసి ఆగినవి కొన్ని
@సురేష్ సారిక

Thursday, 2 January 2020

ఓడిపోయానని ఒప్పుకుంటున్నా...

ఓడిపోయానని ఒప్పుకుంటున్నా
నాలో
ప్రాణమింకా రగులుతూనే వుంది
సాధించగలనన్న నమ్మకం ఆరింది
నాలో
పోరాడగల బలమింకా వుంది
రేపటిపై ఆశ నీరసించింది
ఓడిపోయానని ఒప్పుకుంటున్నా

@సురేష్ సారిక

Wednesday, 1 January 2020

మనసుకెందుకింత ఉక్కబోత?
దట్టమైన జ్ఞాపకాల దుప్పటి కప్పుకున్నదా?
కనులకెందుకింత వెతుకులాట?
వెలుగు పంచే తార దూరమైనదా?
@సురేష్ సారిక