Tuesday, 31 December 2013

prema-ప్రేమ

వరాలనే వద్ధననా...!!! 

నా జత నువ్వైతే ... 

 

స్వర్గాన్నే వదిలెయ్యనా...!!!

నా వెంట నువ్వుంటే ..... 

                        !!సురేష్!!

prema-ప్రేమ

పులకింతలు పరుగులు తీసే 

గిలిగింతలు  గంతులు వేసే


ఊహల ఉయ్యాలలో ఊగుతున్నా.... 

చిరునవ్వుల తీరంలో ఎగురుతున్నా... 

                                     !!సురేష్!!

Tuesday, 24 December 2013

jevitham-జీవితం

వెలుగు నీడలు సన్నగిల్లినా ... 

ఆశాకిరణం నేలరాలినా .... 


నా అన్వేషణకు అంతం లేదు .... 

నా ఆలోచనకు హద్దులు లేవు ...

                           !!సురేష్!!

amma-అమ్మ

దేవుడు చేసిన బొమ్మకు ... 

ప్రాణం పోసెను అమ్మ .... 

 

అమ్మను మరిచిన ప్రాణం 

విలువలేనిది .... 

నిలువరానిది......

                      !!సురేష్!!  

baadha-బాధ

రాతిని పోలిన వనితవు నీవని 

తెలిసి తెలియక పూజలు చేసి 

అలసి సొలసిన ఆశలతోటి 

నలిగిన మనసుతో జీవిస్తున్నా .... 

                               !!సురేష్!!

jevitham-జీవితం

అంతు చిక్కని ఆత్మ వంచన ... 

తగలడుతున్నా నాలో నేనే 

తగలెడుతున్నా ఎన్నో నేనే

                         !!సురేష్!!

desam-దేశం

ఈ మట్టితో ఋనమెట్టిదో .... 

 

శ్వాస ఎగిసిననాడు 

తనపై మోస్తుంది ....

 

శ్వాస సొలసిననాడు 

 తనలో దాస్తుంది ..... 

                  !!సురేష్!!

jevitham-జీవితం

ఆయుధాలతో యుద్ధం 

మనుషులుని చంపుతుంది 


మాటలతో యుద్ధం 

మనసులుని చంపుతుంది 

                         !!సురేష్!!

prema-ప్రేమ

అందం ,ఆనందం 

ఒక్కటైన రూపం మీరు ..... 


చిరునవ్వులు వెదజల్లే 

మరుమల్లెలు మీరు.... 

                        !!సురేష్!!

prema-ప్రేమ

నీ వడిలో పసివాడిలా.... 

నీ కలలో నీ వాడిలా ... 

నీ జతగా చేరాలని .... 

మది తెరిచి అడిగానిలా ..... !!!!

                               !!సురేష్!!

desam-దేశం

నరాలు లేని నాలుకతో 

అర్ధం లేని మాటలతో 

అరిచే అరుపులు 

కాదు పోరాటం ..... 

                     !!సురేష్!!

prema-ప్రేమ

ఎవో ఏవేవో 

కలలే కదిలాయి 


కనులలో నీ రూపం 

కధగా కదిలింది ... ప్రతి క్షణము 

ఓ వరమై నిలిచింది ....

 

నిలిచిన ఆ  క్షణమే 

ఓ వింతై మారింది ....... 


                          !!సురేష్!!


baadha-బాధ

మనసులో చోటు లేదంది 

మాటిమాటికి పలకరిస్తుంది ... 

 

కనుచూపికి దగ్గరగా వుంది 

కన్నీటిని జత చేసింది .... 

                      !!సురేష్!!

Saturday, 21 December 2013

prema-ప్రేమ

ఎం మాయ చేసావే ...!!!

మనసు మురిసిపోతుంది ... 


ప్రేమ పెనవేసావే ...!!!

శ్వాస  నింగికెగిసింది ... 


నిశిరాతిరి నాలోన నిదరొదిలి.... 

నీ వైపు నను వింతగ నడిపింది .... 

                                 !!సురేష్!!

Wednesday, 11 December 2013

andham-అందం

అంబరం సంబరపడే నీ నవ్వుకి 

సూర్యోదయం వెనుతిరిగే నీ వెలుగుకి 

 ప్రకృతి పులకరించే నీ పలుకుకి 

మేఘాలు కదిలే నీ కదలికకి 

చిరుగాలి చెంతచేరే నీ చూపుకి

                                   !!సురేష్!!

Sunday, 1 December 2013

prema-ప్రేమ

జీవితం సరికొత్తగా 

          ఉవ్వెత్తుగా 

నిలిచింది నా ఎదుట .... 


ఊహించానా ఏ నాడైనా 

ఇన్నాళ్ళుగా వేచిన అందం 

ఆనందం నా చెంత చేరేనని ...

                                     !!సురేష్!!

Friday, 29 November 2013

prema-ప్రేమ

కొన్నాల్లే ఊసులు 

ఆపై దొరకవు బాసలు 


మురిపించిన క్షణాలు 

మరిపించెను గతాలు 

 

నీ పలుకులతో

తరిగెను తీరాలు 

చెదిరెను దూరాలు 

మిగిలెను మధురాలు

                               !!సురేష్!!

Monday, 25 November 2013

baadha-బాధ

ఎందుకిలా ఎప్పుడులేని ఈ కలత

ఒక్కసారిగా ఉరుమై నను కాల్చినట్టుగా

ఉవ్వెత్తున ఓ అలవై ముంచినట్టుగా

విశ్వమంతా విరిగి మీద పడినట్టుగా


కుదురులేని నా మనుసులో మరో కలత

నా జీవన సరళిలో మరో మలుపు

                                 !!సురేష్!!


Sunday, 24 November 2013

andham-అందం

నీ మంధహసానికి  బానిసని 

నీ హంస నడకలకి నాదాన్ని 


నీ మాధురగాత్రానికి గీతాన్ని 

నీ అనుబంధానికి బంధీని 


నీలోని ఆశలకు శ్వాసలని 

నీ కనుల కాంతులకి తీరాన్ని 

                                     !!సురేష్!!

Tuesday, 19 November 2013

prema-ప్రేమ

నీపై నా ప్రేమెంతంటే ... ?

మనసులో దాగనంత 

మాటలకు దొరకనంత 


మనసులో దాగనిది భావం 

మాటలకు దొరకనిది కావ్యం 


భావాన్ని గుర్తించవు 

కావ్యాన్ని గమనించవు

                           !!సురేష్!!

Wednesday, 13 November 2013

andham-అందం, prema-ప్రేమ

andham-అందం, baadha-బాధ, desam-దేశం, love, prema-ప్రేమ,andham-అందం, desam-దేశం
andham-అందం, prema-ప్రేమjevitham-జీవితం

అందమైన జీవితం 

అర్ధంకాని జీవనం 

 

ఆరాటం అనే ఆకలితో అలమటిస్తున్నాం

నిత్యం పోరాడుతూ జీవిస్తున్నాం


ఎప్పటికి తీరేను నీ ఆరాటం

ఎన్నాళ్ళు  సాగేను నీ పోరాటం 

 

నీ సడి ఆగే వరకు ...నీ దారి మరిచేవరకు ....

                                                     !!సురేష్!!

Tuesday, 12 November 2013

kutumabm-కుటుంబం

అందమైన కుటుంబం


అనురాగాన్ని పంచే అమ్మ 

అల్లారు ముద్దుగా పెంచే నాన్న 

అండగా నిలిచే అన్న 

అపురూపంగా చూసే అక్క 

అందంగా అల్లరి చేసే తమ్ముడు 

అలరించే చిరు నవ్వుల చెల్లి 

ఇంతకన్నా అందమైన ప్రపంచం ఎం ఉంటుంది ..?


                                                           !!సురేష్!!

Friday, 8 November 2013

prema-ప్రేమ,

ప్రతీ ఘటన ప్రతిఘటనై  పరీక్షిస్తుంది 

కఠినమైన కాలగమనం కాటువేస్తుంది 

నిన్నటి నా నీడ నను ఒంటరంటుంది 

ఈ అనంతంలో నేనెంత అని ప్రశ్నిస్తుంది ...

                                            !!సురేష్!!

Thursday, 7 November 2013

andham-అందం

నిండు చందమామ జారి 

నా ముందు నడిచింది నేడు 


అందమైన వానజల్లు చిక్కగా చక్కగా 

నాపై జలపాతమై జారింది నేడు 

 

మేఘాల చాటున హరివిల్లు మాయమై

నా ముందు నిలిచింది నేడు

                                 !!సురేష్!!

Monday, 4 November 2013

baadha-బాధ

కొంతమంది బాధను కనులలో చూపిస్తారు 

అది కన్నీరై  కొన్నాల్లకు కరిగిపోతుంది.......... 

 

కొతమంది బాధను నవ్వులో చూపిస్తారు 

అది కనులు మూసే వరకు,,, 

కాలం తీరే వరకు,,,,

తరగక నిలిచి వుంటుంది ...... 

              

                                   !!సురేష్!!

Tuesday, 29 October 2013

andham-అందం

మానిక్యమా

మందారమా

ఓ రాగబంధమా.... 


రతనాల రాశుల్లో

మెరిసేటి మనిపూసవా... 


నీకై మారనా

నీలా నేను

నీ నీడలా..... 

                 !!సురేష్!!

prema-ప్రేమ

మనసులో భావం తెలియాలంటే ..?

పెదవుల పలుకులు  అవసరం లేదు

కనురెప్పల చప్పుడు  చాలు ....... 

                                      !!సురేష్!!baadha-బాధ

ఎండిన ఎడారిలో నా దారిలో...

ఎండని ఊహల ప్రయాణము...


కష్టాల కడలిలో నా కనులలో...

కరగని కన్నీటి ప్రవాహము... 

                                         !!సురేష్!!

Monday, 28 October 2013

కవిత

నాకు తెలిసిన కళమిది

నేను రాసిన కావ్యమిది

సిరివెన్నల నాపై కురిసినది

వేటూరిగా నాలో పారినది

వారి జాడలో నడుచుట

నాకు దొరికిన వరమిది 

                                         !!సురేష్!!

Sunday, 27 October 2013

prema-ప్రేమ


నా హృదయం

ప్రతి ఉదయం

నీ వెలుగుతో

ప్రారంభం


కనులు తెరిచిన వేల

కధనం నీవు


కనులు మూసినా వేల

కళలు నీవు 

                          !!సురేష్!!

prema-ప్రేమ

నీ చూపుల చల్లదనం 

నను చేరెను ఈ క్షణం 


నీ పలుకుల కమ్మదనం 

కరిగించెను నా హృదయం 


                                     !!సురేష్!!

prema-ప్రేమ

నీ కనుచూపుతో నను కరిగించావు 

నీ చిరుపలుకుతో నా సడి పెంచావు

నయాగరా వయ్యారం నీ సొంతం 

సరోవర సింగారం నీ సొంతం
                                 !!సురేష్!!

prema-ప్రేమ

ఆదమరిచిన ఆనందం హటాత్తున

తలుపు తడితే 

తట్టుకోగలదా  ఈ యద


మొహమాటపు చాటున దాగిన 

మాటల మూటల గట్టును 

బద్దలు  కొట్టెను నేడు .....

                                !!సురేష్!!


Tuesday, 15 October 2013

prema-ప్రేమ

నిను చూసిన క్షణమే మరణించా ..... 

మరుక్షణమే నీకై జన్మించా .....


అడగని వరమై అడుగుల దూరాన నిలిచావే ... 

గతి తప్పిన గమనానికి గమ్యం నీవయ్యావే ... 

 

ఇకపై నా పయనం.... నీ వైపే !!!

ఇకపై నా లక్ష్యం .......నీ ప్రేమే !!!

                                           !!సురేష్!!

Thursday, 10 October 2013

prema-ప్రేమ

తొలిసారి చూసిన నీ కనుల సాక్షిగా

మలిక్షణమే మైమరిచా మదిసాక్షిగా 


నీ స్వరము నను చేరెను ఓ వరముగా

ఎన్నటికి చెరగక నిధిలా నిలిచేనుగా


మన కలయక ఓ వింతగా మారేనుగా 

మరు జన్మలకి తీయని కలగా మిగేలునుగా

                                          

                                                    !!సురేష్!!

baadha-బాధ

నా అనువారు నను ఆదమరిచినారు

వీడనన్న వారు వీడ్కోలు పలికినారు

 

ఊసులెన్నో పంచినవారు ఉరి వేసి పోయినారు 

తప్పు ఎవరిధైనను  నా తీరు తెన్ను మారెను


ఓదార్చలేరే  నేడు నీడగా తోడు ఒక్కరైనను

                                                                           !!సురేష్!!

Tuesday, 8 October 2013

prema-ప్రేమ

కనుల ఎదుట నీవున్నా 

చూడలేక నా కనులున్నా 


పదిలమైన ఓ మాటున్నా 

పలకలేక నా పెదవున్నా 


పరిక్షించే కాలమెదుట  

పరితపించు ప్రాణమొకటి 

 

వేచివున్నది ............ 

                          !!సురేష్!!Wednesday, 2 October 2013

desam-దేశం

చేతి కర్రతో 

చెరగని చిరు నవ్వుతో 


విర్ర వీగిన ఆంగ్ల మూకల 

వెన్ను విరిచిన వీర పురుషుడు 


జాతిపితగా జాలువారిన జగన్నాధుడు 

నరనారాయణుడి నిజ నిదర్శనం నీ జననం ...
                                                  !!సురేష్!!

 Tuesday, 24 September 2013

prema-ప్రేమ

నీకన్నా నిను ప్రేమించేవాడిని నేనున్నాను

నీ నా ప్రాణానికి ఊపిరి నీవన్నాను

తీరానికి చెరువైపున మనమున్నాము

నా యదలయలు అలలై నిను తాకేను

నిను ప్రేమించాను...నీకై ప్రాణమిస్తాను

                                !!suresh!!


Sunday, 22 September 2013

baadha-బాధ

కనుల ఎదురుగా నీవున్నా 

చీకటి ఛాయలు చుట్టూరా....... 


రాగాల ఆలాపన నీ పలుకులయినా 

శూన్యమై నీ సడి వినబడదుగా ......


హృదయం ఉప్పనై ఉవ్వెత్తున 

ఉరకలేస్తూ ఉరుముతున్నది ....

                                      !!సురేష్!!


Saturday, 21 September 2013

baadha-బాధ

నా అనువారు నను ఆదమరిచినారు

వీడనన్నవారు వీడ్కోలు పలికినారు

ఊసులెన్నో పంచివారు ఉరివేసి పోయినారు .... 

 

తప్పు ఎవరిధైనను నా తీరు తెన్ను మారెను

ఓదార్చ లేరే ఒక్కరైనను .....................

Sunday, 15 September 2013

prema-ప్రేమ

నాలో నిండిన ఊపిరి నీవు 

ఊపిరి రేపిన గానం నీవు 

గానం చేసే గాత్రం నీవు 

గాత్రం కలిగిన మధురం నీవు

                                           !!సురేష్!!

Saturday, 14 September 2013

prema-ప్రేమ

నా కవితల తొలి ఊహవు  నీవు 

నా కవితల తుది శ్వాసవు నీవు 


నా కవితల పదకేలికి ప్రాణం నీవు

నా కవితా కలమున కదలిక నీవు 

                                    !!సురేష్!!Wednesday, 11 September 2013

baadha-బాధ

దయలేని యద ఓనాడు 

నిర్దయగ నను వదిలింది 


యదార్ధమెరుగని మది ఈనాడు 

అనాధగా నను విడిచింది 

 

విషాద గాధగా కధ మార్చింది 

సడి ఆగిన ఈ మన్ను మిన్నంటింది ... ... ....

                                                  !!సురేష్!!


Saturday, 7 September 2013

prema-ప్రేమ

నీ కనుల కొలనులో

కమలంగా కొలువున్నా..... 


నీ కలల విహారాన

యువరాజులా విహరించా


నీ కురుల చిక్కులలో

చామంతిగా చిక్కుకున్నా .....


నీ గలమున హారముగా

మిలమిలలా మెరుస్తున్నా


నీ పెదవుల కదలికలలో

కవితలుగా జారుతున్నా..... 

                                   !!సురేష్!!prema-ప్రేమ

తొలకరి చినుకులు తాకి

తొలి వలపుల తలపులు తుల్లే... 


పున్నమి వెన్నల రాలి

చిరు ఆశల శ్వాసలు ఎగిసే....


కిలకిల పలుకుల సవ్వడి చేరి

తడిచా వలచిన వనితను తలచి....  

                                      !!సురేష్!!

prema-ప్రేమ

నువు ఒంటరి అని తలచిననాడు

నీ జంటగా నేనుంటా అనువాడు

నీ ప్రేమను పొందేందుకు సరివాడు

నీ కోసమే జన్మించిన నీవాడు 

                                      !!సురేష్!!

jevitham-జీవితం

అణువుగా చేరి

తనువుగా మారి

ఆలోచన ఎరిగి

అద్భుత సృష్టికి

సాక్షిగా  వెలిసిన

వింతవు నీవు


అందనిది

అందుకునే

వరకు ఆగని

అడుగులు నీవి 

                      !!సురేష్!!

prema-ప్రేమ

చాటుగా మాటుగా

చూపులు కలిపి

తేనెలు నిండిన

కన్నులతోటి

నవ్వులు రువ్వి

నన్నే నువ్వు

నిలిచిన చోటే

నీనా యదని

ఉక్కిరి బిక్కిరి

ఊహలతోటి

నిండుగ నింపి...?

                     !!సురేష్!!Wednesday, 4 September 2013

prema-ప్రేమ

వరమిస్తావా ...?

నా హృదయపు స్థానం 

నీకై వుందని 

గుర్తించావా .....?

నా పయనం ,సమయం నీ వెంటేనని. 

నా పలుకు ,పిలుపు నీ పేరేనని.

                                              !!సురేష్!!

Sunday, 25 August 2013

prema-ప్రేమ

నువు పలికిన 

చిరు పలుకుల 

విరి సవ్వడి 

దడ దడల 

యదలోతున 

మధురంగా 

మృదులంగా 

ప్రవాహంగా  జారి 

నిదరోయిన 

నా మదికి 

ఈ తీయని 

చిరు రేయిని 

రాల్చినది నీ స్వరం

                             !!సురేష్!!

Friday, 23 August 2013

prema-ప్రేమ

తొలి చూపుతో 

మలి చూపుకై 

మది వేచిన 

క్షణ క్షణం 

అనుక్షణం 

నిరీక్షనై 

నీకై తీక్షణ 

ప్రయాణ ప్రవాహ 

సంద్రాన సాగుతున్నా 

                             !!సురేష్!!