Saturday, 22 November 2014

baadha-బాధ

అంతు దొరకని ఆవేదనలు...
పోల్చుకోలేని పరితపనలు...
నాలో .........
లయతప్పిన యదలయలు...
శృతిమించిన అపశ్రుతులు...
                   !!సురేష్!! !!సారిక!!


Tuesday, 18 November 2014

prema-ప్రేమ

స్వరముగా చేరెను పెదవి అంచున.....

కలలా వాలెను కనుల చాటున..........   

ప్రేమై నిండెను గుండె లోతున............. మరువలేను మగువ నిన్ను మరు జన్మకైనా... 

వీడిపోను వరమా నిన్ను ఎన్ని జన్మలెత్తినా...
                                    

                                        !!సురేష్!! !!సారిక!!

Thursday, 6 November 2014

jevitham-జీవితం

బంధాలకు బందీ కాను

 ఆప్యాయతకు బానిస కాను 

 అనురాగపు అనాగరికుడిని 

ప్రేమెరుగుని పామరుడిని                                                     

                          !!సురేష్!!!!సారిక!!


Thursday, 30 October 2014

prema-ప్రేమ

అంతు పొంతు లేని అనంతమైన ప్రేమ
అవధి హద్దు అన్నది చేరువ కాని ప్రేమ 


నీ కోసం పరుగులు తీస్తూ ...
నిను అనుక్షణం ఆరాధిస్తూ ... 


నా యదలో పదిలంగా ...
చిరకాలం దాగుంటుంది ....

                         !!సురేష్!!సారిక!!

Wednesday, 15 October 2014

baadha-బాధ

యద గాయాలని గుర్తుకు తెస్తూ ...
మనసుకి మాత్రమే శిక్షలు వేస్తూ...

కాటికి  నన్ను  నడిపిస్తుంది ...
కన్నీటికి నన్ను జత చేసింది .... 


                             !!సురేష్!! !!సారిక!!

baadha-బాధ

కన్నీటి దారని తుడిచేదెవరు...???

మదిలో మంటని ఆర్పేదెవరు...???

గుండె బరవుని దించేదెవరు...???

గత జ్ఞాపకాన్ని చెరిపేదెవరు...???

                                          !!సురేష్!! !!సారిక!!

jevitham-జీవితం

అదుపు లేని అలపై సాగే పయనం  జీవితం
దిక్కుతోచని దిశలకు నడిపే ఆశా వ్యామోహం

అంతుచిక్కని ప్రశ్నగా మారిన గమ్యం
కుదురు లేని కలగా వున్నది నిత్యం 


                                      !!సురేష్!! !!సారిక!!

Tuesday, 7 October 2014

jevitham-జీవితం

నాటినాటికి మసకబారుతున్న మానవత్వ ఛాయలు..  

బంధాలని బాంధవ్యాలని మరిచిపోయిన కాలం ... 

కన్నీరు పెడుతూ ఓ చినుకై నిను తాకిన క్షణం ... 

అవాస్తవాలని కడిగేస్తూ వాస్తవాలకి నిను దగ్గర చేస్తుంది.. 


ప్రతి కధ కధనరంగమై..  

జననంతో మొదలై.. 

మరణంతో ముగుస్తుంది.. 


నీ గతమే నీ గతిని నిర్ణయిస్తుంది..  

కాలగమనమే నీ కధని నడిపిస్తుంది..  


నీలో రగిలే ఆశయం ..

 నీపై నీ నమ్మకం ... 

నీ అడుగుని కదిలిస్తుంది ..... 


                                   !!సురేష్!!!!సారిక!!Sunday, 5 October 2014

baadha-బాధ

ప్రేమించానే ప్రాణంగా ... 

నిందిచావే ప్రాణం పోయేలా ... 


నివేదించగలనా ఈ వేదన ...
ఏమని.....?ఎవరికని.....?


మరణిస్తూ.. జన్మిస్తున్నా..ప్రతి క్షణం
                                           
                                          !!సురేష్!!
!!సారిక!!

baadha-బాధ

నీ ఆనందం నీలో లేదని ....
నా వల్లే అది దూరం అయ్యిందని ... 


క్షణాల ఎడబాటుని ..
కలకాలం చేస్తుంది .... 


నీతోనే ఆనంధముందని తెలియలేదా ..?
నీ జతలేక కన్నీరేనని గుర్తించలేదా ...?


                                      !!సురేష్!!
!!సారిక!!

Saturday, 4 October 2014

jevitham-జీవితం

నను నేను ప్రశ్నిస్తున్న కాలం ఇది 


అనుక్షణం ఆరాటపడుతూ ఏదో సాధించాలని సాగుతున్నా... 


అడుగులు తడబడుతున్నా మనుగడ సాగిస్తున్నా...  


సరికొత్తగా యోచిస్తూ నూతన అధ్యాయం రచిస్తున్నా... 


                                          !!సురేష్!!!!సారిక!!

Sunday, 31 August 2014

వదలక నీ ఊపిరి సైతం నేనవుతా .. 

Friday, 29 August 2014

prema-ప్రేమ,

ఒక నిమిషం నీ జత లేకుంటే ... 

జీవిత ఎడబాటని బావిస్తా .... 

నీ పెదవుల సడి వినకుంటే ..

నాలో అలజడి ఆగేనంటా .... 


కలనై నీ కన్నులలో దాగుంటా ... 

చెరగక చీకటిలోను తోడుంటా .... 


నీలో సగమై నీ జతనై  నేనుంటా ...
                               

                                !!సురేష్!! !!సారిక!!

Friday, 8 August 2014

jevitham-జీవితం

జీవితం అంటేనే చలగాటమా.... 

జీవమున్నంత వరకు పోరాటమా ... 


గెలుపన్న కోరిక ఓ నేరమా ... ???

కాసులున్నోడికే అదిదాసోహమా... 


ఓడిపోయే ఆట ఆడేందుకు ... ???

 గెలవాలనే తపన తీరేందుకు ...

                          !!సురేష్!! !!సారిక!!

baadha-బాధ

ఎక్కడని వెతకను 

ఎక్కెక్కి   ఏడ్చే

కన్నులకు దొరకని ఆనందం ... 

 

ఎందుకని ఆ బ్రహ్మ 

ఈ జన్మ నాకిచ్చి 

రోదించమని నన్ను ఓడించెను ... 

                   !!సురేష్!! !!సారిక!!

 

Sunday, 27 July 2014

baadha-బాధ

నిను మరిచి క్షనముండని ప్రాణం... 

నిను విడిచి నిలిచేనా కలకాలం...???


నా తుది శ్వాసలే 

నిను మరిచే క్షణములు ... 


నా మరణమే 

ఈ వేదనకి వీడ్కోలు ....

                              !!సురేష్!!!!సారిక!!

Monday, 21 July 2014

jevitham-జీవితం

కాలం కదలిక ఆగనిది ........... 

ఆగిన నరుడికి అంతమది ..... 


పుట్టుట,గిట్టుట తప్పనిది ..............

నడుమున నాటకం ఆడించునది .... 


మన్నుటయే నీ ధర్మము .......

మిగిలినది దైవాధీనము.............

                                          !!సురేష్!!!!సారిక!!

Thursday, 17 July 2014

jevitham-జీవితం

మిగిలున్నా ఈ మట్టిపై ..... 

ఏ  విలువ లేని ఈ మట్టితో .... 


విముక్తి లేదా నా యదకి ... 

పరీక్షా కాలమా నా శక్తికి ...

                      !!సురేష్!!

Monday, 14 July 2014

baadha-బాధ

మాటిస్తున్నా మౌనంగా .... 

 బంధం పంచిన గాయంతో ... 


నీ జత లేని ఈ జీవితమంతా ... 

నే నొక్కడిగా నే  అడుగులు వేస్తా .... 

 

విడదీసిన  ఈ విధి ఆటలో ... 

నిను ఓడించి నే ఓడి రోదించ  ...  

                          !!సురేష్!!

                   

Monday, 7 July 2014

baadha-బాధ

మధురమైన ఈ ప్రేమకి 

మరనమేరా చివరికి ..... 

 

విడదీయలేని ఈ బంధాన్ని 

మరో బంధంమే  ప్రశ్నించింది  ..... 

 

తలరాతను మార్చలేను .... 

విధి వలను చేధించలేను ....

                              !!సురేష్!!

                                !!సారిక!!

                                

Saturday, 28 June 2014

baadha-బాధ

మానే గాయం  కాదిది ... 

మరిచే కధనం కాదిది .... 


కనపడని యద రోధనలు .... 

వినపడని కన్నీటి అరుపులు ... 


బాధలకి భానిసనయ్యా .... 

చీకటి చిరునామానయ్యా ....

                              !!సురేష్!!

Saturday, 10 May 2014

prema-ప్రేమ

పోరాడుతున్నా  ప్రతిక్షణం నీ ప్రేమకై

పసివాడిలా ఆరాటపడుతున్నా నీ తోడుకై

 

విధికి  వ్యతిరేకమై సాగుతున్నా 

గెలవాలనే ఓ తపనతో ..... 

 

ఆశలని శ్వాసలుగా  మల్చుతున్నా

నీవు  నా జీవితాసయమై ......

                                 !!సురేష్!!Friday, 9 May 2014

prema-ప్రేమ

ప్రతి చినుకు తపిస్తుంది 

           నిను తాకాలని 

చిరుగాలి చిన్నబోయింది 

              నీ జాడేదని 

చిగురాకు నీ ఊసడిగింది 

జలధార నిను చేరాలంది

                          !!సురేష్!!

Monday, 31 March 2014

prema-ప్రేమ

కన్నులు చూడని  దృశ్యం  ప్రేమ 

పెదవులు పలకని  గానం  ప్రేమ 

కలముకు దొరకని కవితలు  ప్రేమ 

కరిగే  కాలపు  సవ్వడి   ప్రేమ


మనసుతో చూసే మౌనం ప్రేమ 

మదిలో  మ్రోగే  రాగం  ప్రేమ 

కధగా మిగిలే మధురం ప్రేమ 

తరగని తీయని ఊహలు ప్రేమ

                            !!సురేష్!!

Wednesday, 26 March 2014

prema-ప్రేమ

నీ  ప్రతి  శ్వాస  నేనై  చేరనా ... 

నీ ప్రతి అణువు నేనై మారనా ...


నీ కడవరకు నీ అండగా నడవనా .... 

నీ ఆనందమై నీ అందున నిలవనా .... 


నీ కనుల కలలను నిజముగ మార్చనా ... 

నీకన్నా నిను ప్రేమించే ప్రాణం నేనవ్వనా ....

                                           !!సురేష్!!

jevitham-జీవితం

చిక్కబడ్డ    చీకటిలో    ప్రతి    రంగు    నలుపే ........

ఉదయించిన హృదయంలో ప్రతి  మలుపు గెలుపే... 


సాగే సెలయేరులా ఒడిదుడుకులు నే దాటనా..... 

వీచే  చిరుగాలిలా  ప్రతి  అంచుకు  నే  చేరనా..... 

 

వెలుగుని దోచే చీకటి  నే దాచనా..... 

కాలం వేసే సంకెళ్ళు నే తెంచనా.... 

                                          !!సురేష్!!

Wednesday, 19 March 2014

baadha-బాధ

మనసులలో మరణిస్తూ 

నా ఊసులు చెరిపేస్తూ 

ఆశలను అనిచేస్తూ 

శ్వాసలను లేక్కేస్తూ 

కాలాన్ని కరిగిస్తూ 

ఏకాకిగా జీవిస్తూ 

చివరిక్షణం ముగిస్తా .... 

                         !!సురేష్!!

prema-ప్రేమ

ఎండమావిలా నను చేరిన  ఈ బంధాన్ని 

వెలుగునిస్తూ చీకటి చేర్చిన ఈ బంధాన్ని 

 పరిమళిస్తూ  ప్రాణం తీసిన ఈ బంధాన్ని

నా తోడు చేరి నను ఒంటరి చేసిన ఈ బంధాన్ని 

................ వెలివేస్తున్నా.................

                                                               !!సురేష్!!

Sunday, 16 March 2014

prema-ప్రేమ

నీ జననం నా కోసం 

నీ పరిచయం ఆశ్చర్యం 

నీ  పలుకులు ఆనందం 

నీ ప్రేమ నాకో వరం నా  జన్మకు ఓ అర్ధం 

నా గమ్యం నీ   ప్రపంచం 

నా ప్రతీ క్షణం నీ సొంతం 

నా ప్రాణం నీ కోసం 

               !!సురేష్!!

Saturday, 15 March 2014

andham-అందం

నిను చూసిన కన్నులకి

హరివిల్లు అలుసేగా.... 


నీ  పెదవుల పలుకులకి 

పదనిసలు పల్లవి  తుల్లేనుగా ... 

 

నీ అడుగుల జాడలకి 

జలపాతపు జడులు జరిగేనుగా .. 


నీ కన్నుల వెలుగులకి 

పున్నమి వెన్నల అలుగేనుగా ...

                                 !!సురేష్!!

Thursday, 6 March 2014

prema-ప్రేమ

నా కన్నుల ముందు నీ  రూపం 

నాలో హద్దులు దాటిన ఆనందం 

 

కనురెప్పలు మూసిన కల్లోలం 

ఆ క్షణమే యదలో ఓ యుద్ధం 

                             !!సురేష్!!

 

Thursday, 27 February 2014

prema-ప్రేమ

నీ చెంతకు చేరిన క్షణాన నాలో

మాటలు దొరకక తికమక  తీరేనా ...!!!


నీ ఊహలతో నా ఆయువు పెరిగెను...

నీ ఊపిరి నాలో సగమై చేరెను ... 

                                !! సురేష్ !!

Wednesday, 26 February 2014

andham-అందం

నా కనులకి చిక్కిన అందము నీవు
నా ఊపిరి కారాగారమున బందీ నీవు
నా కోసం వికసించిన కుసుమం నీవు
నా యదలో ఉదయించిన  తారవు నీవు
                                          !!సురేష్!!
                               

             

Thursday, 20 February 2014

jevitham-జీవితం

నింగిలోతుల నడుమున 

సాగిన కాలాలు ... 


నవ్వుతూ నలుగుతూ 

నడిచిన క్షణాలు ... 

 

మరణించినా మిగిలే జ్ఞాపకాలు ...... 

ధైవమందించిన ఆనంద అందాలు ....

                                   !!సురేష్!!

baadha-బాధ

నీ మౌనపు మంటలు 

మనసుని మసి చేస్తున్నవే..... 


నీ ద్వేషపు చూపులు 

నను దహిస్తున్నవే ........

                     !!సురేష్!!

prema-ప్రేమ

నీ చూపులు విసిరిన బాసలు 

నా మనసుని తాకెను సూటిగా .... 


నా ప్రాణం నీవనే  నీ పలుకులు 

నా మదిలో ఒదిగెను పదిలమై .....

                                 !!సురేష్!!

jevitham-జీవితం

నాకే నేను సందేహంలా ... 

నా మది నను నిందించేలా .... 

ప్రతి క్షణం కాలం ప్రశ్నిస్తుంది .... 


రేపన్నది నాతో ఆడుతున్నది .. 

అందంగా ఆనందాన్ని దాస్తున్నది ... 

సున్నితంగా సుడిగుండమై ముంచుతున్నది ..... 

                                               !!సురేష్!!

Tuesday, 7 January 2014

dhevullu-దేవుళ్ళు

దగ్గరగా వుంటే ఆకర్షిస్తాం .... 

దూరంగా వుంటే ఆరాధిస్తాం ... 


అందాన్ని ఆకర్షిస్తాం.... 

దైవాన్నీ ఆరాధిస్తాం .....

                 !!సురేష్!!

baadha-బాధ

చుట్టూ అంతా వెలుగు నీడలు వున్నా....!!

నా కనులలో చీకటి ఛాయలు.... 


పెదవులపై చిరునవ్వులు  వెదజల్లినా ..!!

 మనసులో చితిమంటలు చెలరేగుతున్నాయి .... 

                                          !!సురేష్!!

Friday, 3 January 2014

prema-ప్రేమ

చూడలేని కళ్ళతో కలలు కంట్టున్నా ... 

తరిగిపోని ప్రేమతో  ఎదురు చూస్తున్నా... 

 

ఒక్కచోట లేకున్నా 

         ఒక్కరిగా కలిసున్నాం ...

                               !!సురేష్!!