Monday, 30 December 2019

భయపడుతుంది మనసు

భయపడుతుంది మనసు
బయట పడేందుకు
మరోసారి ఛిద్రమై
అతికి బ్రతికే బలం లేక
@సురేష్ సారిక

Saturday, 28 December 2019

నిద్రకు సిద్ధమౌతున్నా…

కంటిలో రంగులన్నీ ఆర్పి
దేహాన్ని హాయిగా పడేసి
గుండె అలజడి తగ్గించి
ఊపిరి భారం పెంచి
@సురేష్ సారిక

Friday, 27 December 2019

అలల అందం

చంద్రుడు ఒంపిన వెన్నెల పూసుకుని
చెంగుచెంగున ఎగిసి పడుతున్నవి అలలు.
గజ్జలు కట్టుకుని చిందులేస్తున్నట్టున్నవి.
సిగ్గుపడి వెనుతిరిగి వయ్యారాలు ఒంపుతున్నట్టున్నవి.
@సురేష్ సారిక

Thursday, 26 December 2019

గెలిచానో..? ఓడానో..?

వర్షమని సేదతీరుతున్నా
కురుస్తున్నది నిప్పుల వర్షం
సంగీతమని ఆస్వాదిస్తున్నా
వినిపిస్తున్నది రోదనలు
పువ్వులని చిందులేస్తున్నా
నేలమీదున్నది ముళ్ళు
గెలిచానో..? ఓడానో..?
ఆనందమో..? ఆవేదనో..?
మూర్ఖుడినో..? మహాత్ముడినో..?
బ్రతుకుతున్నానా..?
బ్రతికేవున్నానా..?

@సురేష్ సారిక

Wednesday, 25 December 2019

గతం గాయమై కలిగిస్తున్న బాధ

నిప్పుల కుంపటి
గుండెకు హత్తుకున్నట్టుంది

ముళ్ల కంచ
గొంతు గుహలో కదులుతున్నట్టుంది

విష పురుగులు
దేహమంతా గాటుతున్నట్టుంది


@సురేష్ సారిక

Tuesday, 24 December 2019

ఎదురు చూపులు

కనులకింపైన రూపం చూసేందుకు
కలలకంటిన రూపం చేరిపేందుకు
నచ్చని గతాన్ని మరిచేందుకు
నచ్చేలా రేపటిని మలిచేందుకు
కొత్త రుచులు నోట కరిచేందుకు
తేనేటి మాటలు అరిచేందుకు
మోతనో, సంగీతమునో ఆలకించేందుకు
ఆనందమో, ఆవేదనో అనుభవించేందుకు
నాతో నేను పోటీ పడేందుకు
నన్నోడించి నాపై నేను గెలిచేందుకు
@సురేష్ సారిక

కొత్త అనుభవం

పరిచయం లేని అనుభవం
నా మనసుకి
స్పందించే తీరు తెలియక
తికమక పడుతున్నది.
@సురేష్ సారిక

చూసి జాలిపడుతున్నా...

చూస్తున్నా ఓ చిన్ని అణువులో అనంతాన్ని
నేనింతే అని చిదిగిపోతున్న అనంతాన్ని
అద్భుతాలు చెయ్యగలిగిన అద్భుతాన్ని
అల్ప సుఖాలకు అలవాటు పడిన అల్పుడిని
చూసి జాలిపడుతున్నా
జగమింతే అని దాటిపోతున్నా
@సురేష్ సారిక

Friday, 20 December 2019

మరువలేను - Telugu Quotes

మావి చిగురుల
లేత వగరుల రుచి
చిలికిన పెరుగున
తేలిన నురగల కమ్మదనం
పున్నమి వెన్నెల
రేపే వెచ్చని జలదరింపు
చల్లగాలి సోకి
రెక్కలన్ని చాచి
చిందులేసే నెమలి సొగసులు
లాలిగేయాలతో
ఆకాశ వీధి బంధు వరుసలతో
గోరు ముద్దలు
@సురేష్ సారిక

Tuesday, 17 December 2019

ప్రయోగమొక ఆట నాకు - Telugu Poetry

ఒకడికి నేను జ్ఞానిని
మరొకడికి అజ్ఞానిని
నాకు నేను పసివాడిని
ప్రయోగమొక ఆట నాకు
ఫలితమేదైనా అద్భుతం నాకు
ఇక వాడి, వీడి అభిప్రాయమెందుకు
@సురేష్ సారిక

Thursday, 12 December 2019

జీవిత సత్యాన్ని వివరిస్తున్న ఒంటరితనం - Telugu Poetry

వెలుగుల అందాలు చూపుతున్న చిమ్మ చీకటి
రాగాల కమ్మధనం వినిపిస్తున్న కఠోర నిశ్యబ్ధం
జీవిత సత్యాన్ని వివరిస్తున్న ఒంటరితనం
@సురేష్ సారిక

Friday, 6 December 2019

సన్నాసివాడవు, వాడు నీవు కానన్నవాడవు - Telugu Poetry

నీ అడుగుని కదిపెడి వాడెవ్వడు
నీ బుద్ధిని నడిపెడి వాడెవ్వడు
నీ నోట మాట పలికెడి వాడెవ్వడు
నీ ఊహల పలకన రంగులద్దెడి వాడెవ్వడు
నీ ఎదుట ఫలితముకై శ్రమించిన వాడెవ్వడు
సన్నాసివాడవు
వాడు నీవు కానన్నవాడవు
@సురేష్ సారిక

Tuesday, 3 December 2019

చిరు ప్రయత్నాలు పరుగు - Telugu Quotes

పావు జీవితమేగిన కాన రాలేదు అసలైన జీవితం.
అవసరాలు తీర్చుకునేందుకు సరిపోతున్న కాలం.

కొత్త అనుభూతులు పొందేందుకు పాకులాడుతున్నా.
ఖరీదైన కొద్ది క్షణాలను పోగేసేందుకు అల్లాడుతున్నా.

సొమ్మగిల్లిన మనసుపై చిరు జల్లుకై
వడిలిన కంటికి అందమైన విందుకై

చిరు ప్రయత్నాలు పరుగు.

@సురేష్ సారిక

Monday, 2 December 2019

ఏమౌతున్నానో? ఏమైపోతానో? - Telugu Quotes

రోజు రోజుకి బరువెక్కుతున్న జీవితం
మోయాల్సిన అవసరమేంటి అనే ప్రశ్న
దించుకునేందుకు ధైర్యం లేదో
లేక తేలిక పడుతుందనే ఆశో
గతి తప్పిన ఆలోచనో
మతి తప్పిన సూచన ఇదో
ఏమౌతున్నానో? ఏమైపోతానో?
ఎదురు చూడనా? వీడ్కోలు పలకనా?
@సురేష్ సారిక

Sunday, 1 December 2019

ఇంగితమేడ వదిలినారో వీరు - Telugu Poetry

జాతి గతి వినిపించ
కూసంత గోల సేయగా
ఎర్రోడి రంకెలంటిరి.
నాలుగు నీతి ముక్కలు
గట్టిగ పలుకగా
వితండ వాదమంటిరి.
వినెడి శక్తి పోయనదో
విని గ్రహించ బుద్ధి కరువైనదో
ఇంగితమేడ వదిలినారో వీరు
@సురేష్ సారిక

Saturday, 30 November 2019

నీ ప్రాణం ఆడుతున్నంత వరకే ఈ విశ్వపు మనుగడ - Telugu Poetry

నీ గుండె కదలిక వెంట
పరిగెడుతున్నది కాలం
నీ కంటి రెప్పల చప్పుడు విని
పొడుస్తున్నది పొద్దు
నీ ఊపిరి పోసుకుని
ఊరేగుతున్నది అనంతం
నీ ప్రాణం ఆడుతున్నంత వరకే
ఈ విశ్వపు మనుగడ
@సురేష్ సారిక

Sunday, 10 November 2019

తీర్చలేని రుణం - telugu poetry

నను మోసిన నవమాసాలు
ఓ పండుగే నా తల్లికి.
ఆనందంగా భరించింది అన్ని దినములు.
రోజురోజుకి భారమైన, భద్రంగా కాపు కాసింది.
పిచ్చిది కడుపు లోపల లాగితంతే మురుసుకుంది.
వినపడలేదు నా తల్లి ఆర్తనాదాలు.
ఆ చిన్నపాటి లోకం దాటిన వేళ.
పాపపు పసివాడిని
ఆ తల్లికి అంతటి వేదన నా వల్లనే.
అదో వింతే,
నా తల్లి నన్ను చూసిన మొదటి క్షణం.
నా ఏడుపు చూసి నవ్వుకుంది.
ఆనందంతో అల్లాడిపోయింది.
పుట్టకతోనే రుణపడిపోయా నా తల్లికి జన్మాంతా.
@సురేష్ సారిక 

Thursday, 7 November 2019

నా కథ – Part 3

తరుముకు పోయిన కాలం
తురుముకు పోయిన జీవితం.
సరిదిద్దుకోలేని పొరపాటులు
సర్దుకుపోయేoదుకు సిద్ధమైన జీవితం.
ఎదురు దెబ్బలు తగిలి, కుంటు పడిన ఆలోచతో
పారే ప్రపంచంలో ఎదురీదలేక కొట్టుకుపోతున్నా.
చచ్చిన ఆశలకు ఊపిరి పోసేందుకు
బ్రతకాలనే బలమైన కోరిక పుట్టేందుకు
క్షణాలని తగలబెడుతూ ఎదురు చూస్తున్నా.
చిన్నపాటి జీవితం పొందిన గునపాఠాలతో
నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ
నిలబడి ఓటమిపై తిరగబడుతున్నా.
ఇన్నాళ్లుగా చూసిన జీవితమింతే
ఇకపై చూడాల్సిన జీవితమెంతో
మరో జన్మపై నమ్మకం లేని మనిషిని
గెలిచినా? ఓడినా? నా పోరాటం ఆగదు.
@సురేష్ సారిక

నా కథ – Part 2 – Telugu Kavithalu

కలై కరిగిపోతున్న జీవితాన
నిజమై ఎదురుపడిందో మగువ.
నా గమనాన్ని మార్చింది.
నాకొక గమ్యం అయ్యింది.
మనసొకటుందని తెలిపింది.
కమ్మని భావాలను చల్లింది.
సరదాగా సాగిపోతున్న కాలం
ఉన్నట్టుండి ఎదురు తిరిగింది.
పెను ఉప్పనై విరుచుకుపడింది.
సుడిగాలై చెల్లా చెదురు చేసింది.
ముడి పడితేనే బంధం అంది.
మన పుట్టుక ఒక్కటి కాదంది.
మన మధ్యన ముడులు
పైవాడు వెయ్యలేదంది.
బలం లేని మనసుకి
మోయలేని భారమైంది ఈ ప్రేమ.
నాతో విడిపడి
మరొకరితో ముడి పడింది ఈ ప్రేమ.
ఒంటరిగా పోరాడలేక ఒరిగిపోయా.
అలవాటు లేనిది కదా గుండె తట్టుకోలేకపోయింది.
ఆనందాన్ని వెలివేసింది.
మరో ప్రేమని దరి చేరనివ్వకుంది.
చీకటితో సావాసమంటుంది.
తనని తాను నిత్యం చంపుకుంటుంది.
కన్నీటిని తుడుచుకుంటూ
మసకబారిన చూపులతో
ప్రతి రోజు ఒకే స్థితిగా సాగిపోతున్నా.
ముళ్ళ కంపలపై నిద్రిస్తున్నా.
మండుటెండల్లో సేద తీరుతున్నా.
@సురేష్ సారిక 

Telugu kavithalu on Indian culture