Saturday, 30 November 2019

నీ ప్రాణం ఆడుతున్నంత వరకే ఈ విశ్వపు మనుగడ - Telugu Poetry

నీ గుండె కదలిక వెంట
పరిగెడుతున్నది కాలం
నీ కంటి రెప్పల చప్పుడు విని
పొడుస్తున్నది పొద్దు
నీ ఊపిరి పోసుకుని
ఊరేగుతున్నది అనంతం
నీ ప్రాణం ఆడుతున్నంత వరకే
ఈ విశ్వపు మనుగడ
@సురేష్ సారిక

Sunday, 10 November 2019

తీర్చలేని రుణం - telugu poetry

నను మోసిన నవమాసాలు
ఓ పండుగే నా తల్లికి.
ఆనందంగా భరించింది అన్ని దినములు.
రోజురోజుకి భారమైన, భద్రంగా కాపు కాసింది.
పిచ్చిది కడుపు లోపల లాగితంతే మురుసుకుంది.
వినపడలేదు నా తల్లి ఆర్తనాదాలు.
ఆ చిన్నపాటి లోకం దాటిన వేళ.
పాపపు పసివాడిని
ఆ తల్లికి అంతటి వేదన నా వల్లనే.
అదో వింతే,
నా తల్లి నన్ను చూసిన మొదటి క్షణం.
నా ఏడుపు చూసి నవ్వుకుంది.
ఆనందంతో అల్లాడిపోయింది.
పుట్టకతోనే రుణపడిపోయా నా తల్లికి జన్మాంతా.
@సురేష్ సారిక 

Thursday, 7 November 2019

నా కథ – Part 3

తరుముకు పోయిన కాలం
తురుముకు పోయిన జీవితం.
సరిదిద్దుకోలేని పొరపాటులు
సర్దుకుపోయేoదుకు సిద్ధమైన జీవితం.
ఎదురు దెబ్బలు తగిలి, కుంటు పడిన ఆలోచతో
పారే ప్రపంచంలో ఎదురీదలేక కొట్టుకుపోతున్నా.
చచ్చిన ఆశలకు ఊపిరి పోసేందుకు
బ్రతకాలనే బలమైన కోరిక పుట్టేందుకు
క్షణాలని తగలబెడుతూ ఎదురు చూస్తున్నా.
చిన్నపాటి జీవితం పొందిన గునపాఠాలతో
నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ
నిలబడి ఓటమిపై తిరగబడుతున్నా.
ఇన్నాళ్లుగా చూసిన జీవితమింతే
ఇకపై చూడాల్సిన జీవితమెంతో
మరో జన్మపై నమ్మకం లేని మనిషిని
గెలిచినా? ఓడినా? నా పోరాటం ఆగదు.
@సురేష్ సారిక

నా కథ – Part 2 – Telugu Kavithalu

కలై కరిగిపోతున్న జీవితాన
నిజమై ఎదురుపడిందో మగువ.
నా గమనాన్ని మార్చింది.
నాకొక గమ్యం అయ్యింది.
మనసొకటుందని తెలిపింది.
కమ్మని భావాలను చల్లింది.
సరదాగా సాగిపోతున్న కాలం
ఉన్నట్టుండి ఎదురు తిరిగింది.
పెను ఉప్పనై విరుచుకుపడింది.
సుడిగాలై చెల్లా చెదురు చేసింది.
ముడి పడితేనే బంధం అంది.
మన పుట్టుక ఒక్కటి కాదంది.
మన మధ్యన ముడులు
పైవాడు వెయ్యలేదంది.
బలం లేని మనసుకి
మోయలేని భారమైంది ఈ ప్రేమ.
నాతో విడిపడి
మరొకరితో ముడి పడింది ఈ ప్రేమ.
ఒంటరిగా పోరాడలేక ఒరిగిపోయా.
అలవాటు లేనిది కదా గుండె తట్టుకోలేకపోయింది.
ఆనందాన్ని వెలివేసింది.
మరో ప్రేమని దరి చేరనివ్వకుంది.
చీకటితో సావాసమంటుంది.
తనని తాను నిత్యం చంపుకుంటుంది.
కన్నీటిని తుడుచుకుంటూ
మసకబారిన చూపులతో
ప్రతి రోజు ఒకే స్థితిగా సాగిపోతున్నా.
ముళ్ళ కంపలపై నిద్రిస్తున్నా.
మండుటెండల్లో సేద తీరుతున్నా.
@సురేష్ సారిక 

Telugu kavithalu on Indian culture