1, సెప్టెంబర్ 2020, మంగళవారం

బిగుసుకున్నది గుండే అదే పనిగా కష్ట మెత్తి

బిగుసుకున్నది గుండే
అదే పనిగా కష్ట మెత్తి

అలిసిపోయింది ఆశ
పదే పదే చచ్చి పుట్టి

నానిపోయింది కన్ను
కన్నీట మునిగి

చెయ్యి చాచింది బ్రతుకు
ఓ గట్టి తోడుకి

సురేష్ సారిక వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి